సామాన్యులకు ఎప్పుడు అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండు ఒకటి. అరటి పండ్లలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, చక్కెర ఉంటుంది. అయితే రాత్రి లేదా శీతాకాలంలో అరటి పండ్లు తినడం సురక్షితం కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అరటి పండు తినడం వల్ల త్వరగా జీర్ణం కాదు. అందుకే రాత్రి సమయాల్లో వీటిని తినకూడదు. అరటి వల్ల రక్తంతో చక్కెర స్థాయి త్వరగా పెరుగుతుంది.