మహారాష్ట్రలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణా పై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో సుమారు రూ.50 వేల కోట్ల మాదకద్రవ్యాలను పట్టుకున్నట్లు ఫడణవీస్ శుక్రవారం తెలిపారు.
ఇటీవల రూ.300 కోట్ల విలువైన 151 కిలోల మెఫెడ్రోన్ ను స్వాధీనం చేసుకుని, 12 మందికి పైగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ మేరకు శివసేన ఎమ్మెల్యే రవీంద్ర వైకర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.