అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలి.
గతంలో కంటే ఈసారి 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చు. ప్రతిపక్ష పార్టీలు చేసే విష ప్రచారాలను బలంగా తిప్పి కొట్టాలి." అని కేబినెట్ భేటీలో సీఎం జగన్ పేర్కొన్నారు.