వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో ఎదురయ్యే శ్వాసకోశ, జీర్ణ సంబంధ రోగాలకు చెక్ పెడుతుంది. వెల్లుల్లిలో క్యాల్షియం, ఐరన్, విటమిన్-సీ, బి6, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం అధికంగా ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ వైరల్ లక్షణాలు దగ్గు, జలుబును తగ్గిస్తాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ శరీరంలో తెల్లరక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. చలికాలంలో వచ్చే అలర్జీలకు వెల్లుల్లి చెక్ పెడుతుంది.