దానిమ్మలో విటమిన్ C, E, K, మెగ్నిషియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ గింజలను తింటే మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, నరాలు, కండరాలు బాగా పనిచేసేందుకు సహకరిస్తాయి. నరాల బల హీనతను తగ్గిస్తాయి. మెగ్నిషియం నరాలు, కండరాల ఆరోగ్యం బాగుండేలా చేస్తాయి. అల్పాహారానికి దానిమ్మ ఉత్తమమైన పండు. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.