యాలకులు వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇది యాంటిసెప్టిక్, ఇన్పెక్షన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. నోటి దుర్వాసన పోవడానికి యాలకులు ఉపయోగపడతాయి. ఇది చిగుళ్ల వ్యాధి, కావిటీలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడేందుకు సహాయపడుతుంది. యాలకులలో ఫైటోకెమికల్స్, విటమిన్లు, ఖనిజాలతో పాటు పాలీఫెనాల్స్, ప్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.