కొబ్బరిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. శరీరం నుండి హానికరమైన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. దెబ్బతిన్న కణాల పెరుగుదలలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరిలో విటమిన్ ఎ, బి, సి, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరికాయ తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.