మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను మేనేజ్ చేయడం పెద్ద సవాల్‌తో కూడుకున్న విషయం. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గితే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
దీని వల్ల నరాలు దెబ్బతినడం, మూత్రపిండాల సమస్య, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి. షుగర్ కంట్రోల్ అవ్వడానికి సోలియ్ కండరాలను లక్ష్యంగా చేసుకునే లెగ్ ఎక్సర్‌సైజులు చేయాలి. సోలియస్ కండరాల వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి సహజంగా తగ్గుతుంది.