పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ప్రారంభమైంది. మండలంలోని 14 గ్రామాల్లో 28 చోట్ల ఆర్బీకేలు, సబ్ స్టేషన్, సచివాలయం, పాల వెల్లువ కేంద్రాల భవనాలను ప్రారంభించ నున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జడ్పీటీసీ దామోదర రాజు, వైసీపీ చౌడేపల్లె మండలాధ్యక్షుడు అంజిబాబు, సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో సుధాకర్ తదితరులున్నారు.