2024లో ప్రపంచంలోని 40కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. సుమారు 40శాతానికిపైగా ప్రజలు ఈ క్రతువులో పాలుపంచుకోనున్నారు. ప్రపంచ జీడీపీలో అత్యధిక శాతాన్ని ఈ దేశాలు కలిగి ఉండటం గమనార్హం. ప్రపంచ అగ్రగామిగా చెప్పుకొనే అమెరికా, రష్యా, భారత్, బ్రిటన్, మెక్సికో, దక్షిణాఫ్రికా, చిన్న దేశాలైన ఇరాన్, దక్షిణ సూడాన్, తైవాన్, భూటాన్‌తో పాటు యూరోపియన్ యూనియన్ ఎన్నికలు జరుగనున్నాయి.