* దట్టమైన పొగమంచులో వాహనాలను నడిపేటప్పుడు కచ్చితంగా ఫాగ్‌లైట్లు వెలుగుతూనే ఉండాలి.
* తెల్లవారు జామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల కంటే వేగం దాటకుండా వాహనాలను నడపాలి.
* రోడ్డు పక్కన బండి నిలిపి ఉంచినప్పుడు హెడ్‌లైట్‌లతో పాటు, వెనుక లైట్లు కూడా వెలుగుతూ ఉండాలి.
* వాహనం చుట్టూ రేడియం టేప్ తప్పనిసరి.
* రాత్రి వేళల్లో హైబీమ్ లైట్లకు బదులు లోబీమ్ లైట్లను వినియోగించాలి.