రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తన మంత్రి వర్గాన్ని విస్తరించనుంది. శనివారం 18-20 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గవర్నర్ కల్రాజ్ మిశ్రా మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కేబినేట్ విస్తరణకు ముందు భజన్‌లాల్ శర్మ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ కేంద్ర నేతలతో భేటీ అయ్యారు.