న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికులు, అంగన్వాడి వర్కర్లు గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెలకు శుక్రవారం జనసేన, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు వాసగిరి మణికంఠ, బి. సురేష్, చిన్న తదితరులు సంఘీభావం తెలిపారు. వారు సమ్మె శిభిరం వద్దకు వెళ్లి కూర్చున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.