మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని ఏఐటీయూసీ అనుబంధ గౌరవ అధ్యక్షుడు వీరభద్ర స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం గుంతకల్లు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ నిరసనలో నాయకులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.