మేషం: మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
వృషభం: చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
మిధునం: వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.
కర్కాటకం: వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకుగా వస్తాయి.
సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య: పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. స్థిరస్తి వివాదాలలో శిరో బాధలు తప్పవు.
తుల: వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.
వృశ్చికం: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.
ధనస్సు: సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.
మకరం: ఉద్యోగులకు పనిఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
కుంభం: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం: దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు.