చలికాలంలో చిన్నారులకు రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనికి తోడు పిల్లలు ఆహారం తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఫలితంగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చలికాలంలో రోగనిరోధక శక్తి కోసం పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం ద్వారా మేలు జరుగుతుంది. ప్రతి రోజు బాదంపప్పు మీ చిన్నారులకు ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది. బాదం తీసుకోవడం ద్వారా చిన్నారుల మానసిక, శారీరక వికాసం మెరుగు పడుతుంది. నానబెట్టిన బాదంతో ఎక్కువ ఉపయోగం లభిస్తుంది.
వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా కాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఇతర ముఖ్యమైన విటమిన్లు శరీరానికి లభిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్ లోపలి నుంచి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అందువల్ల చలి కాలంలో మీ చిన్నారులకు ఇది ఇవ్వడం బెటర్. అలాగే పిస్తా కూడా శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఇనుము, పొటాషియం, రాగి, భాస్వరం వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.