క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన తిరుపతి రాజు గుంటూరు సమీపంలోని ఓ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో గది అద్దెకుతీసుకుని ఉంటున్నాడు.
నూతన సంవత్సర వేడుకల కోసం తన మిత్రులతో కలసి హోటల్ గదిని అద్దెకు తీసుకున్నారు. శనివారం హోటల్ గదిలో బాత్ రూంకి వెళ్లి కాలుజారి పడి మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.