నూతన సంవత్సరం సందర్భంగా రేపల్లె పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఎవరు ఇంటి వద్ద వారే ఉండి వేడుకలు జరుపుకోవాలని రేపల్లె పట్టణ సీఐ నజీర్ బేగ్ సూచించారు.
ఆదివారం రేపల్లెలో ఆయన మాట్లాడుతూ యువకులు అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి బైక్ లపై తిరగరాదన్నారు. తాగి బైక్ లపై రోడ్లపైకి వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి బైక్ లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్ల నిర్వహణకు అనుమతి లేదన్నారు.