సిఆర్డిఏ పరిధిలోని కౌలు రైతులకు గత ఏడాది మే నెల నుంచి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
శనివారం మంగళగిరి సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అమరావతిని అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వాల మాటలునమ్మి రైతులు పొలాలను స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తుచేశారు. కౌలు చెల్లించని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.