మేషం: వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
వృషభం: స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.
మిథునం: ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తికావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
కర్కాటకం: విలువైన గృహాపకరణాలు బహుమతులుగా పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి.
సింహం: ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
కన్య: వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.
తుల: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు.
వృశ్చికం: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు: స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరువుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
మకరం: దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు.
కుంభం: కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
మీనం: ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాల పరిష్కారం అవుతాయి.