అవిసె గింజల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ గింజల్లో పీచు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిలోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ గుండెకు రక్తసరఫరా చేసే నాళాల్లో కొలెస్ట్రాల్ ని పేరుకోనీయకుండా చేస్తుంది. ఈ గింజలను నానబెట్టి తింటే మలబద్ధకం సమస్య పోతుంది. ఈ గింజలు తింటే కణాల ఆరోగ్యం, జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. ఈ గింజలు హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తం గడ్డకట్టే సమస్యలను, ఒత్తిడిని తగ్గిస్తాయి.