ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్ష అడ్మిట్ కార్డులు బుధవారం విడుదలకానున్నాయి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్షలు నిర్వహించనున్నారు.