నోటిపూత అనేది చాలా మందికి సాధారణ సమస్య. దీనికి హోం రెమెడీస్‌తో చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక చెంచా ధనియాల పొడిని నీటిలో వేసి మరిగించి రోజుకు మూడు సార్లు తాగితే ఉపశమనం కలుగుతుంది.తేనేను నేరుగా నోటి పుండ్లపై పూయవచ్చు. యాలకుల పొడిని తేనెతో కలిపి రాసినా నోటి పూత తగ్గుతుందంటున్నారు. వెన్న, నెయ్యిని రోజుకు 4 సార్లు రాసినా నోటి పూత తగ్గుతుందంటున్నారు.