రాత్రిపూట నిద్రపట్టకపోతే పగలు నిద్ర ముంచుకొస్తుంది. ఇది ఎవరికైనా సహజం. కానీ డే టైంలో తిన్నవెంటనే తట్టుకోలేనంతగా నిద్ర ముంచుకు వస్తే దాన్ని ఫుడ్ కోమాగా వైద్యులు పేర్కొన్నారు. పగలు లిమిటేషన్‌కు మించి తినడం, పిజ్జా, బర్గర్స్, బిర్యానీలు, సమోసాలు, వంటివి ఎక్కువగా తినడంవల్ల కూడా ఇది సంభవిస్తుంది. లంచ్ టైంలో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే హెల్తీ ఫుడ్స్, తాజా పండ్లు తీసుకోవడంవల్ల అతినిద్ర సమస్యను దూరం చేసుకోవచ్చు.