కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. విటమిన్లు ఎ, బి12, డి, ఇ, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. వేపుళ్లు, చిప్స్ వంటి ఆహారాన్ని తగ్గించాలి. మటన్, బీఫ్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యం తీసుకోవడం పరిమితం చేయాలి. ప్రాసెస్ చేసిన ఆహారం, స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, బాదం, ఎర్ర బియ్యం తీసుకోవాలి.
లేయం మన శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో, రక్తం నుండి మలినాలను శుద్ధిచేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది పైత్య రసాన్ని విడుదల చేసి జీర్ణక్రియకు తోడ్పడుతుంది, శక్తి శరీర అవసరాల కోసం వినియోగిస్తుంది. కాబట్టి మీ శరీరంలోని ఇతర అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా మీ కాలేయాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి.