ఉసిరిలో ఔషధ గుణాల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఉసిరి రసం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా అనేక వ్యాధులను దూరం చేసే శక్తి కూడా ఉంది. ఉసిరికాయలో విటమిన్ సి, విటమిన్ ఎబి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, డైయూరిటిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.