అర్ధరాత్రి వరకు వెబ్ సిరీస్ లు, సినిమాలు, సీరియల్స్ చూసి పడుకొనే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా టీవీ చూస్తూ నిద్రపోతే అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. గదిలో తక్కువ మొత్తంలో పరిసర కాంతితో నిద్రించే వ్యక్తులలో మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. టీవీ చూస్తూ పడుకున్నప్పుడు పడుకొనే భంగిమ తెలియదు దాంతో పొద్దున్న లేచినప్పుడు ఏదోక పక్కా పట్టేసినట్లు ఉంటుంది.