కుందుర్పి మండల కేంద్రంలో మంచినీటి కోసం శనివారం గ్రామ ప్రజలు, మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తాగునీరు రాకపోవడంతో కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ తోటల్లో నీళ్లు తెచ్చుకునే దుస్థితి నెలకొందన్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa