గత 20 రోజులు పైగా ధర్మవరం పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెలో ఉండడంతో డ్రైనేజీలన్నీ చెత్త చెదారంతో పూడుకుపోయాయి. ఎట్టకేలకు కార్మికులు సమ్మె విరమించడంతో శనివారం ధర్మవరం పట్టణంలోని 36 వ వార్డులో పూడిపోయిన డ్రైనేజీని వార్డ్ కౌన్సిలర్ చింత ఎల్లయ్య పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించి శుభ్రం చేయించాడు. మిగతా చోట్ల కూడా విడతల వారిగా శుభ్రం చేయిస్తానని ఆయన అన్నారు.