నిమ్మకాయ రసం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే ఎక్కువగా నిమ్మరసం తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఈ పోషకం స్థాయి పెరిగితే, అది శరీర అవయవాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే కడుపులో ఆమ్ల స్రావం పెరుగుతుంది. ఇది గ్యాస్ట్రిటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ నోటి కణజాలంలో వాపు, నోటిపూత సమస్యకు దారి తీస్తుంది.