ఏదైనా శరీరక శ్రమ జరిగినప్పుడు చెమట పడుతుంది. కానీ కొంతమంది ఏమీ చేయకుండానే చెమటలు పడుతుంటాయి. అలా అయితే జాగ్రత్తగా ఉండాలి. గుండె కవాటం వాపు, ఎముక సంబంధిత ఇన్ఫెక్షన్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వంటి అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. విపరీతమైన చెమట గుండె జబ్బులకు సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఒత్తిడి కూడా అధిక చెమటకు కారణమవుతుంది. ఇలాంటి వారు ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. మద్యానికి దూరంగా ఉండాలి.