చలికాలంలో ప్రజలు వేడి వేడి ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. కానీ చాలా మందికి ఈ సమయంలో అరటిపండ్లు తినాలని అనిపించదు. ఎందుకంటే అరటిపండ్లు ఎక్కువగా తింటే దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. అరటి పండులో శరీరానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, కాల్షియం తగిన మోతాదులో ఉంటాయి. కాబట్టి దీన్ని రోజూ తినడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుంది. జీర్ణ సమస్య తొలుగుతుంది.