భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యలో "స్వయం" వేదిక ద్వారా ఆన్ లైన్ విధానంలో నాణ్యమైన స్కూల్, కాలేజీ విద్యను అందిస్తున్నారు. స్వయం పోర్టల్ నందు 2,748పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
స్వయం అదించే కోర్సులకు యూజీసి, ఏఐసిటీ గుర్తింపు ఉంటుంది. ఇప్పటి వరకు 18 మిలియన్లకు పైగా విద్యార్ధులు ఈ వేదికలో ఆన్ లైన్ కోర్సుల కోసం నమోదు చేసుకున్నారు. మిలియన్ కు పైగా విద్యార్ధులు తమ కోర్సును పూర్తి చేసి సర్టిఫికెట్ అదుకున్నారు.