నిమ్మకాయతో కలిపి కొన్నింటిని తీసుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్పైసీ ఫుడ్ లో చాలామంది నిమ్మకాయ పిండుకొని తింటారు. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయంటున్నారు. అలాగే పాలు, రెడ్ వైన్, సీఫుడ్, తీపి పండ్లు, మజ్జిగ, పెరుగు, ఆల్కలీన్ కూరగాయలు వంటి వాటితో నిమ్మకాయను కలిపి తీసుకోకూడదని పేర్కొంటున్నారు. కొన్ని ఘాటైన సుగంధ ద్రవ్యాలతోనూ నిమ్మను తీసుకోకూడదంటున్నారు.
సర్వరోగ నివారిణి వెల్లుల్లి: చలికాలంలో వెల్లుల్లి తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వంటలో వెల్లుల్లితో వచ్చే రుచే వేరు. అనారోగ్య సమస్యలకు వెల్లుల్లి చెక్ పెడుతుంది. వెల్లుల్లి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వృద్ధ్యాప్య లక్షణాలు తగ్గుతాయి. యాంటీ హైపర్లిపిడిమియా ప్రభావాలు ఉండటంతో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. దీని వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. వెల్లుల్లి తింటే రక్తపోటు కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.