అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు సమయం దగ్గరపడుతోంది. ఒక్కొక్కటిగా రామాలయం వస్తువులు అయోధ్యకు చేరుకుంటున్నాయి. తాజాగా రామాలయం కోసం తయారు చేసిన బహుబలి తాళం అయోధ్యకు చేరుకుంది.
ఈ తాళం ప్రపంచంలోనే అతి పెద్దది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ ఈ బహుబలి తాళంను తయారు చేశారు. దీని బరువు 40 కేజీలు ఉంటుంది. తాళం తయారు చేయడానికి రూ.2 లక్షల ఖర్చు అయింది.