చికెన్ లోని కాలేయాన్ని కొంతమంది ఇష్టంగా తింటే మరి కొంతమంది మాత్రం అంత ఇష్టాన్ని చూపించరు. అయితే చికెన్ లివర్ డెంటల్ హెల్త్ సపోర్ట్ చేస్తుంది. ఈ లివర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగానిరోధకతను పెంచుతుంది. కళ్ళు, చర్మం, జుట్టు, గోళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. లివర్ ను ఉడికించి తీసుకోవడం మంచిది. లేకపోతే డాక్ట్ అనే బ్యాక్టీరియా బారిన పడతాం. దీన్ని అతిగా తిన్నా మంచిది కాదు.
విటమిన్-C లోపిస్తే: శరీరానికి ఆహారం ద్వారా విటమిన్-C తగినంత మోతాదులో లభించాలి. లేకుంటే పలు అనారోగ్యాలు చుట్టుముడతాయి. విటమిన్-Cలో కొవ్వును శక్తిగా మార్చే కార్నిటైన్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరానికి లభించకుంటే అలసట తలెత్తుతుంది. శరీరంలో విటమిన్-C లోపిస్తే కొల్లాజెన్ ఉత్పత్తి కాక పొడి చర్మం ఏర్పడుతుంది. అంతేకాకుండా దంతాలు, చిగుళ్ల సమస్యలు, కండరాల నొప్పులు వస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది.