మేషం: మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. రావలసిన ధనం చేతికందడంలో ఆలస్యం అవుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు.
వృషభం: చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.
మిథునం: వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహమున కొందరు మాటలు మానసికంగా చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.
కర్కాటకం: దూరప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అనుగ్రహం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
సింహం: ఉద్యోగమున అదనపు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.
కన్య: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. పదోన్నతులు పెరుగుతాయి. గృహమున సంతాన వివాహ విషయమైన ప్రస్తావన వస్తుంది. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.
తుల: నిరుద్యోగులు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.
వృశ్చికం: కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
ధనస్సు: ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దాయాదులతో స్థిరాస్తి తగాదాలు ఉంటాయి. సంతానం విద్యా విషయాల నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది.
మకరం: భూ క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో ఇతరుల నుండి విమర్శలు తప్పవు. వృధా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు.
కుంభం: సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
మీనం: భూ సంభందిత వ్యవహారాలలో తగాదాలు చికాకు పరుస్తాయి. సంతానంతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలు మిశ్రమ ఫలితాలుంటాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆర్ధిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలలో భాగస్తులు నుండి ఒత్తిడి పెరుగుతుంది.