ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌగిలింతతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2024, 10:49 AM

ఆనందమొచ్చినా, బాధొచ్చినా, సంతోషమొచ్చినా ఎదుటివారిని కౌగిలించుకోవడం కొందరికి సర్వసాధారణ విషయం.  కౌగిలి బాధ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే కౌగిలి కూడా మంచిదే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
ఎదుటివారు బాధలో ఉన్నారనిపిస్తే చాలు వారిని దగ్గరికి తీసుకొని ధైర్యం చెబుతుంటారు. బాధలో ఉన్నవారికి ఎదుటివారి స్పర్శ ఎంతో ఓదార్పునిస్తుంది. అందులోనూ ఒక కౌగిలి వారిని మరింత ధైర్యవంతుల్ని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవును హగ్ ప్రేమను వ్యక్తపరచడమే కాదు.. మనసుకు ప్రశాంతతను కలిగించడంలో కూడా బాగా సహాయపడుతుందని పరిశోధకులు వెళ్లడిస్తున్నారు. శరీరక స్పర్శ ఒత్తిడిని తగ్గించి మనసును తేలిక పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాధలో ఉన్నవారికే కాదు కౌగిలించుకున్న వేరే వారికి కూడా ఒక హగ్ ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. హగ్ వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం పదండి
ఎదిగే పిల్లలకు హగ్ ఎంతో అవసరమంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే వారిని తరచుగా హగ్ చేసుకుంటే వాళ్లు శరీరకంగా ఎదగడంతో పాటుగా మానసికంగా కూడా ఎదుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హగ్ తో పిల్లల్లో పాజిటీవ్ నెస్ పెరుగుతుందని అధ్యయనాలు తేల్చి చెబుతున్నారు. కాగా కొంత మంది మానసిక శాస్త్రవేత్తలు ఈ విషయంపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దీని కోసం కౌగిలింతలకు దూరమైన కొంత మంది అనాథపిల్లలను సెలక్ట్ చేసుకున్నారు. ఆ చిన్నారులు శరీరకంగానే కాదు, మానసికంగా కూడా క్రుంగుబాటుకు గురయ్యాని వారు తెలిపారు. అయితే ఈ పిల్లలపై హగ్ ఎంతో ప్రభావం చూపిందని పేర్కొన్నారు. కౌగిలింతతో వారిలో శారీరక, మానసిక అభివృద్ధి ఎంతో జరిగిందని పేర్కొంటున్నారు. అంతేకాదు పదివారాల పిల్లలపై హగ్ చాలా ఎఫెక్ట్ చూపుతుందని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. 
పిల్లలకు కాదు పెద్దలకు కూడా కౌగిలింత ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. జీవితంలో అనేక ఒత్తిడుల నుంచి బయటపడాలంటే హగ్ లు తప్పకుండా ఉండాల్సిందేనని వర్జీయాకు చెందిన ఓ థెరపిస్టు స్టడీ తెలుపుతోంది. దీని ప్రకారం.. ఒక మనిషికి తన జీవితకాలంలో ఎన్నో కౌగిలింతలు కావాలని వెల్లడిస్తోంది. ఆ స్టడీ ప్రకారం.. ఒక వ్యక్తి జీవించాలంటే ఖచ్చితంగా నాలుగు హగ్గులు తప్పకుండా ఉండాల్సిందేనట. అలాగే మన రోజువారి పనులు మెరుగ్గా జరగాలంటే ఎనిమిది కౌగిలింతలు తీసుకోవాలని తెలుపుతోంది. అయితే ఈ కౌగిలింతల వల్ల పని ఒత్తిడిని తగ్గించడమే కాదు, మనలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అలాగే మన స్కిల్స్ పెరుగుతాయని ఆ స్టడీ చెబుతోంది. ఈ గజిబీజీ లో లైఫ్ లో ఒక మనిషికి ఒక నాలుగు హగ్ లు తప్పకుండా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. 
కౌగిలింత ఎదుటివారిలోని బాధలను, భయానలు కూడా పంచుకునే సాధనంలా కూడా ఉపయోగపడుతుంది. అవును అందుకే చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు తల్లిదండ్రులు ముందుగా చేసే పని వారిని కౌలిగించుకోవడమే. దీని వల్ల వారిలోని భయాలు, ఆందోళనలు పోయి ప్రశాంతంగా మారతారు. ఇది చిన్నపిల్లలకే కాదు పెద్దవారికి కూడా వర్తిస్తుంది. మాటల్లో చెప్పలేని భావాలను ఒక కౌగిలింత ద్వారా తెలపొచ్చు. అంతేకాదు కౌగిలింత ఒక వ్యక్తిపై గట్టి నమ్మకాన్ని కూడా ఏర్పరుస్తుంది.
 కౌగిలింత వల్ల దంపతులకు కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. తరచుగా వారి భాగస్వాములను కౌగిలించుకోవడం వల్ల వారికి గుండె జబ్బులు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు హగ్ చేసుకోవడం వల్ల రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ హర్మోన్ దెబ్బలు త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. అలాగే కౌగిలింత వల్ల రోగ నిరోధక శక్తి పెరగడం, జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న రోగాలు త్వరగా నయం అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com