టైప్ 2 షుగర్ వ్యాధి వచ్చిన వారు జీవితాంతం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. అయితే మన వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలను తీసుకుంటే ఈ సమస్య తగ్గుతుందట.
దాల్చిన చెక్కను ఆహారంలో బాగం చేస్తే జీవక్రియ రేటుని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. నల్ల మిరియాలు, వాటి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియాంత్రిస్తాయి. యాలకులు, మెంతులు షుగర్‌ని కంట్రోల్ చేయడంలో పనిచేస్తాయి.