తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 9 కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నారు. టైం స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో సమయం పడుతుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. నిన్న 67,568 మంది స్వామివారిని దర్శించుకోగా 22,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లు సమర్పించారు.