పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ కాకరకాయ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాకరకాయలో ఐరన్, విటమిన్ సి, జింక్, పొటాషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని రోజూ తీసుకుంటే వారికి ఔషధం కంటే తక్కువేమీ కాదు. కాకరకాయ గుండె ఆరోగ్యంగా ఉండటానికి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో ప్రజల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ కాకరకాయ తింటే మంచిది.