పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 మార్చిలో జరగనున్నాయి. ఇందు కోసం ఫీజు తత్కాల్ పథకం కింద ఫిబ్రవరి 2వ తేదీ వరకు చెల్లించే అవకాశం కల్పించినట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.కృష్ణారావు తెలియజేశారు. విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు రూ.100 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజును చెల్లించడానికి ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు.