నరదృష్టితో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే వారానికి ఒకసారి రాళ్ల ఉప్పును నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట ఉండదు. సోమరితనం పరారవుతుంది.
నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది ఇంటి గుమ్మానికి ఇరువైపులా ఉంచాలి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. రుణ బాధలుంటే.. వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది.