పాన్కేక్లు, ఫ్రైడ్ చికెన్, కుకీలు, ఐస్ క్రీమ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే మహిళల్లో గర్భాశయం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలకు దూరంగా ఉండాలట. ఇక గర్భాశయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఫుడ్స్‌ను అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఫైబర్, పోటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సి లభించే నిమ్మజాతి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.