మన విశ్వం శరవేగంగా విస్తరిస్తోందని, విస్తరణ రేటు పెరుగుతోందని శాస్త్రవేత్తలు పలు సందర్భాల్లో తెలిపారు. ఇందుకు కారణం డార్క్ ఎనర్జీ అని వెల్లడించినా ఇటీవల పరిశోధకులు ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు. చిన్న చిన్న యూనివర్సులను మన విశ్వం తనలో కలుపుకుంటోందని ఇదే విస్తరణకు కారణమని తెలిపారు. కాగా మన విశ్వం కూడా ఏర్పడిన కొన్నేళ్లకు మరో విశ్వంలో కలిసిపోయిందని అందుకే తక్కువ కాలంలో ఇంతగా విస్తరించినట్లు పేర్కొన్నారు.