మనిషి శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కళ్ళు కూడా ఉంటాయి. కంటి యొక్క స్పష్టమైన బయటి పొరగా కార్నియా అని చెప్పుకుంటాం. ఇది రెటీనాపై కాంతిని కేంద్రీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది మెదడుకు దృశ్యమాన సమాచారాన్ని ప్రసారం చేయడానికి బాధ్యత వహిస్తుంది. మన శరీరంలో రక్తప్రసరణ జరగని ఏదైనా భాగం ఉందని అంటే అది కంటిలోని కార్నియానేనట. ఎందుకంటే ఈ భాగం నేరుగా గాలి నుండి ఆక్సిజన్ ను గ్రహించగలదట.