మానవ శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైన అవయవం అని మనందరికీ తెలుసు. కాలేయాన్ని హాని కలిగించే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.! ఆల్కహాల్ కాలేయంలోని కణాలను దెబ్బతీసి కాలేయ వ్యాధికి కారణమౌతుంది. అధిక కొవ్వు, అధిగ చక్కెర, ఫాస్ట్ ఫుడ్ పదార్థాలు కాలేయాన్ని దెబ్బ తీస్తాయి. యాంటిబయాటిక్స్, క్యాన్సర్ మందులతో పాటు పెప్టిసైడ్లు, డ్రగ్స్ కలిపిన ఆహార పదార్థాలు కూడా కాలేయానికి చాలా హానికరమని వైద్యులు చెబుతున్నారు.