తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ వర్ధమాన్ జైన్
ఆధ్వర్యంలో తితిదే ట్రస్టులకు రూ.43 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.33.33 లక్షలు, ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళంగా కేటాయించారు.