రాంచీ వేదికగా శుక్రవారం ఇంగ్లాండ్ తో జరిగే 4వ టెస్ట్ లో భారత్ గెలిచి సిరీస్ పట్టేయాలని వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగానే రాంచీలో స్పిన్ పిచ్ సిద్దం చేసింది. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పిచ్ తీరుపై స్పందించాడు. ‘ఈ పిచ్ పై కొన్ని పగుళ్లు ఉన్నాయి. కచ్చితంగా బంతి టర్న్ అవుతుంది. కానీ, ఎంత టర్న్ అవుతుంది? ఏ రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అనేది చెప్పలేను’ అని వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa