సోయాబీన్స్ అనేది అనేక పోషకాల గని, వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సోయాబీన్స్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అసలు ఉండదు. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని డైట్‌లో చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగుపరచి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి సమ్మేళనాలు దీనిలో ఉంటాయి. ఇవి హృదయనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.